కరోనాతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక్క ఆదివారం రోజే.. 9 మంది మృత్యువాత పడ్డారు. కొవిడ్‌తో చికిత్స పొందుతూ కేసముధ్రం మండలం ఇనుగుర్తి గ్రామానికి చెందిన ఒక యువకుడు మూడు రోజులుగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. నెల్లికుదురు మండలం చిన్న ముప్పారం గ్రామానికి చెందిన ఓ మహిళ (36 ) 4 రోజుల క్రితం కరోనాకు గురై ఇంటి వద్దే చికిత్స తీసుకుంటుంది. ఆదివారం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కావడంతో హైదరాబాద్ తీసుకుని వెళ్తుండగా మార్గమధ్యలో మరణించింది.
కోరలు చాస్తున్న కరోనా.. పిట్టల్లా రాలుతున్న జనం - corona cases in mahabubabad district
రాష్ట్రంలో కరోనా కోరలు చాస్తోంది. మహమ్మారి బారిన పడి పదుల సంఖ్యలో ప్రాణాలొదులుతున్నారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఒక్కరోజే తొమ్మిది మంది మహమ్మారికి బలయ్యారు.

మహబూబాబాద్ జిల్లా వార్తలు, మహబూబాబాద్‌లో కరోనా వ్యాప్తి, మహబూబాబాద్‌లో కరోనా మరణాలు
నెల్లికుదురు మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి ( 55 ) తొర్రూరు ప్రభుత్వ ఆస్పత్రిలో, ఓ వృద్దుడు ( 70 ) హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. గూడూరు మండలంలో ముగ్గురు వ్యక్తులు, దంతాలపల్లి మండల కేంద్రంలో ఒకరు, మహబూబాబాద్ మండల కేంద్రంలో ఒకరు మహమ్మారికి బలయ్యారు.
జిల్లాలో ప్రతినిత్యం వందల మంది కరోనా బారిన పడుతూ ప్రతిరోజు 10 మంది వరకు మృతి చెందుతుండటంతో జిల్లా వాసులు భయాందోళనకు గురవుతున్నారు.
- ఇదీ చదవండి:కరోనా 'మహా' విలయం- మరో 56వేల కేసులు