కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా ప్రజలు విచ్చలవిడిగా శుభకార్యాల్లో పాల్గొంటున్నారు. పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలం పేరపల్లి గ్రామంలో జరుగుతున్న ఒక వివాహ వేడుకలో కొవిడ్ నిబంధనలు సరిగా అమలు అవుతున్నాయా అని ఎస్సై శ్యాంపటేల్ తనిఖీ చేయగా... ఆ వివాహ వేడుకల్లో కొవిడ్ లక్షణాలున్న మహిళ పాల్గొన్నట్లు తెలుసుకున్నారు. సదరు మహిళకు కరోనా నిర్ధరణ పరీక్ష చేయించగా పాజిటివ్‌గా తేలింది. ఈ వివాహానికి హాజరైన వారిని హోంఐసోలేషన్లో ఉండి... రెండు రోజుల తర్వాత కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు.
పెళ్లిలో సందడి చేసిన కరోనా సోకిన మహిళ.. కేసు నమోదు - telangana varthalu
ప్రభుత్వం కట్టుదిట్టంగా ఎన్ని చర్యలు విధించినా.. ప్రజల్లో మార్పు రానంత వరకు కరోనా మహమ్మారిని అరికట్టడం ఎవరితరం కాదు అనే విధంగా ప్రజలు విచ్చలవిడిగా శుభకార్యాల్లో పాల్గొంటున్నారు. పెద్దపల్లి జిల్లా పేరపల్లి గ్రామంలో కొవిడ్ నిబంధనలు పాటించకుండా వివాహం జరిపించిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
పెళ్లిలో సందడి చేసిన కరోనా నిర్ధారిత మహిళ
కొవిడ్ నిబంధనలను అతిక్రమించి వివాహం జరిపించిన వధువు, వరుని తల్లిదండ్రులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కరోనా లక్షణాలు ఉండి కూడా వేడుకల్లో పాల్గొన్న మహిళపై కూడా కేసు నమోదు చేశారు. ప్రజలందరూ ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ శుభకార్యాలు చేసుకోవాలని... లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమాన్‌పూర్ ఎస్సై శ్యాంపటేల్ తెలిపారు.
ఇదీ చదవండి: సరదాగా ఈతకు వెళ్లిన విద్యార్థి.. శవమై తేలాడు.!