గంజాయి సరఫరాను అరికట్టేందుకు చేస్తున్న స్పెషల్‌డ్రైవ్‌లో భాగంగా కార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని మూసాపేట్, జనతానగర్, వడ్డెరబస్తీ, గూడ్‌షెడ్ రహదారుల్లో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు.
Corden Search: కూకట్‌పల్లిలో కార్డన్ సెర్చ్.. వాహనాల జప్తు - పోలీసులు కార్డన్ సెర్చ్
గంజాయి సరఫరా కట్టడిలో భాగంగా పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కూకట్‌పల్లి పీఎస్ పరిధిలోని నిర్బంధ తనిఖీలు చేపట్టారు. దాదాపు 379 నివాసాలను జల్లెడపట్టారు. సరైన పత్రాలు లేని 31 బైక్‌లు, రెండుఆటోలు, కారును పోలీసులు జప్తు చేశారు.
కూకట్‌పల్లిలో కార్డన్ సెర్చ్
దాదాపు 165 మంది సిబ్బందితో కలిసి 379 నివాసాలను జల్లెడ పట్టారు. పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలానాలు, సరైన త్రాలు లేని 31 ద్విచక్రవాహనాలు, రెండు ఆటోలు, కారు సీజ్ చేశారు. అనుమతి లేకుండా నిర్వహిస్తున్న రెండు మద్యం దుకాణాల్లో 32 బాటిళ్లు స్వాధీనం చేసుకుని నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: