యాదాద్రి భువనగిరి జిల్లాలో కంటైనర్ లారీ బీభత్సం సృష్టించింది. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న కంటైనర్ లారీ భువనగిరి మండలం నందనం వద్ద ఆటోని ఢీ కొట్టింది. అందులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి నడుములు విరిగాయి. ఓ ద్విచక్ర వాహనంతోపాటు వలిగొండ మండలం నాతాళ్లగూడెం వద్ద ఎదురుగా వస్తున్న. ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. ఆ ఘటనలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న వారు సురక్షితంగా బయటపడ్డారు.
వాహనాలను నిర్లక్ష్యంగా ఢీకొట్టడంతో ఆగ్రహం చెందిన వాహనదారులు, బస్సులోని ప్రయాణికులు కంటైనర్ లారీ డ్రైవర్ని పట్టుకొని చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారమిచ్చారు. కంటైనర్ లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండడం వల్లే ప్రమాదాలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రయాణికుల చేతిలో వాహనదారుల చేతిలో దెబ్బలు తిన్న డ్రైవర్ మారుతిని చికిత్స కోసం భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.