తెలంగాణ

telangana

ETV Bharat / crime

ముఖ్యమంత్రిని దూషించిన ఏఆర్ కానిస్టేబుల్ అరెస్ట్​ - Constable made inappropriate comments on CM Jagan

Inappropriate comments on CM: ముఖ్యమంత్రిని దూషించారని.. ఏఆర్‌ కానిస్టేబుల్‌ తన్నీరు వెంకటేశ్వరరావు ఏపీలోని నందిగామ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది.

NTR district
NTR district

By

Published : Feb 4, 2023, 12:15 PM IST

Inappropriate comments on CM: ఆంధ్రప్రదేశ్​లోని ఎన్టీఆర్‌ జిల్లా చిల్లకల్లు పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ.. హైవే మొబైల్ వెహికల్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న ఏఆర్‌ కానిస్టేబుల్‌ తన్నీరు వెంకటేశ్వరరావు.. సీఎంను దూషించారని నందిగామ పోలీసులు అరెస్ట్ చేశారు.

అనంతరం ఆయనను జగ్గయ్యపేట కోర్టులో హాజరుపరిచారు. కోర్టు కానిస్టేబుల్ వెంకటేశ్వరరావుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వెంకటేశ్వరరావు విధుల్లో ఉన్న సమయంలో ఓ వ్యక్తి పోలీసుల జీతాల గురించి ప్రస్తావించారు. ఇదే విషయంపై ఆయన సీఎంపై అసభ్య వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియో పోలీసులకు చేరడంతో చర్యలకు ఉపక్రమించారు.

ABOUT THE AUTHOR

...view details