నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ మేస్రం రాము గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. తోటి సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
గుండెపోటుతో కానిస్టేబుల్ హఠాన్మరణం - నిర్మల్ నర్సాపూర్‌లో గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి
విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా... చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈఘటన నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) ఠాణాలో జరిగింది.

నిర్మల్ జిల్లా వార్తలు
కానిస్టేబుల్ మృతి విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్... ఆస్పత్రికి వెళ్లి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వపరంగా అందాల్సిన బెనిఫిట్లను తక్షణమే అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇదీ చూడండి:suicide: యువతి సూసైడ్.. లభించని మృతదేహం