హైదరాబాద్ మలక్‌పేటలో రోడ్డు ప్రమాదం(road accident) జరిగింది. ఈ ఘటనలో కానిస్టేబుల్ మృతి (constable died)చెందాడు. రాంనగర్ ప్రాంతానికి చెందిన ప్రణీత్ కుమార్(2020 బ్యాచ్) నార్త్ జోన్ డీసీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
Accident: రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి - రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి
శనివారం తెల్లవారు జామున ఓ కానిస్టేబుల్(constable) బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో మరో ద్విచక్రవాహనం ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో కానిస్టేబుల్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటన హైదరాాబాద్ మలక్‌పేటలో చోటుచేసుకుంది.
constable died in road accident
ఈరోజు తెల్లవారు జామున మూసారాం బాగ్ ప్రాంతంలో ఉండే మిత్రుడిని కలిసేందుకు బైక్‌పై వచ్చే క్రమంలో.. మరో ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈఘటనలో కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలయ్యాయి. దీనితో తీవ్ర రక్తస్రావం అయ్యి అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకుని.. కేసు నమోదు చేసుకున్నారు. మరో వాహనదారుడికి గాయాలు కావడంతో.. వైద్య చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.