మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధిలోని సురారంలో నివసించే కానిస్టేబుల్ రమణ కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏపీ ఇంటెలిజెన్స్ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేసిన రమణమూర్తి(38) ఏడేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి గన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నారు
కుటుంబ కలహాలతో కానిస్టేబుల్ ఆత్మహత్య - constable suicide in medchal district
మద్యానికి బానిసైన ఓ కానిస్టేబుల్ కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధిలోని సురారంలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మేడ్చల్ జిల్లా వార్తలు, మేడ్చల్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్య, దుండిగల్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్య
కొన్ని రోజులుగా మద్యానికి బానిసైన రమణ మూర్తి తరచూ కుటుంబ సభ్యులతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో భార్య తన సోదరుడి ఇంటికి వెళ్లిన తర్వాత మే1న రమణ మూర్తి ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న దుండిగల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- ఇదీ చదవండికుటుంబ కలహాలతో కానిస్టేబుల్ ఆత్మహత్య