కుటుంబ కలహాలతో ఓ కానిస్టేబుల్ గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మలక్ పేట్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. మూసరాంబాగ్లో నివాసముంటోన్న అభిలాష్.. మాదన్నపేటలో విధులు నిర్వహించేవాడు. రెండు రోజుల క్రితం భార్య, పిల్లలను.. సొంతూరు కోదాడలోని తన ఇంట్లో వదిలేసి వచ్చాడు. రాత్రి సమయంలో కత్తితో గొంతు, చేతి మణికట్టు వద్ద కోసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
కుటుంబ కలహాలతో కానిస్టేబుల్ ఆత్మహత్య - కానిస్టేబుల్ ఆత్మహత్య
హైదరాబాద్ మలక్పేట్ పీఎస్ పరిధిలో.. కుటుంబ కలహాలతో ఓ కానిస్టేబుల్ గొంతు కోసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Constable commits suicide
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆత్మహత్య జరిగిన తీరును పరిశీలించారు. అభిలాష్ మృతికి కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు ప్రారంభించినట్లు వారు తెలిపారు.
ఇదీ చదవండి:క్షణికావేశంలో భార్య తలపై సుత్తెతో కొట్టి చంపిన భర్త