రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివరాంపల్లిలో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. నేషనల్ పోలీస్ అకాడమీలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న బండ వాసు... ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణం చెందాడు.
Suicide: ఫ్యాన్‌కు ఉరేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య - HYDERABAD LATEST SUICIDE
రంగారెడ్డి జిల్లాలోని శివరాంపల్లిలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఫ్యాన్‌కు ఉరివేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య
వాసు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వాసు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాల కారణంగానే కానిస్టేబుల్ వాసు మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ఇదీ చూడండి:పోషకాల్లేని పంటలతో పెనుముప్పు