రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్‌పోర్టు పీఎస్ పరిధిలోని జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య(Suicide)కు పాల్పపడ్డాడు. వికారాబాద్ జిల్లా ఎన్నికలతల గ్రామానికి చెందిన ఆశయ్య... చేవెళ్ల ఎక్సైజ్ కార్యాలయంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. డ్యూటీ నిమిత్తం శనివారం ఉదయం 10 గంటలకు శంషాబాద్ ఎక్సైజ్ కార్యాలయానికి వచ్చాడు.
Suicide: శంషాబాద్ ఎక్సైజ్ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య - Shamshabad crime news
శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్ పరిధిలోని జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో ఓ కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్నాడు. ఇందుకు గల కారణాలు ఇంకా తెలియలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
కానిస్టేబుల్ ఆత్మహత్య
ఇతని డ్యూటీ అయిపోవడం వల్ల రిలీవర్ గదికి వచ్చి చూడగా ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియజేయగా శంషాబాద్ పోలీసులు ఘటనాస్థలంలో ఆధారాలు సేకరించారు. ఆశయ్య ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆర్థిక పరిస్థితులు, ఇతర కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.