ఎల్‌బీనగర్ కూడలిలో కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం - congress worker suicide

18:32 October 02
ఎల్‌బీనగర్ కూడలిలో కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం
కాంగ్రెస్ పిలుపునిచ్చిన విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్ ఉద్రిక్తతకు దారితీసింది. ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. పోలీసుల అనుమతి లేకున్నా చేసి తీరుతామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో రేవంత్ నివాసం, దిల్సుఖ్నగర్లో పోలీసులు భారీగా మోహరించారు. ర్యాలీ కోసం వచ్చిన కాంగ్రెస్ కార్యరక్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.
ఇదే సమయంలో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసుల కన్నుగప్పి ఎల్బీ నగర్‌లోని శ్రీకాంతాచారి విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేశాడు. పెట్రోల్ పోసుకుని కల్యాణ్ అనే విద్యార్థి బలవన్మరణానికి యత్నిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.
ఇదీ చదవండి :REVANTH REDDY: 'తెలంగాణ ఇంకెంతో కాలం కేసీఆర్ చేతిలో బందీగా ఉండదు'