సికింద్రాబాద్ పరిధిలో గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో ఉద్రిక్తత నెలకొంది. ఉత్సవాల్లో భాగంగా నిమజ్జనాని(GANESH IMMERSION)కి వెళ్తున్న రెండు వర్గాల మధ్య మాటలు ఘర్షణకు దారితీశాయి. సికింద్రాబాద్ అంజయ్యనగర్కు చెందిన వారు.. మంగళవారం రాత్రి వినాయకుని నిమజ్జనానికి స్థానిక హస్మత్పేట్ బోయిన్ చెరువు వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ముందున్న మరో వాహనాన్ని తీయమన్నందుకు రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరిగి కొట్టుకునే వరకు దారితీసింది.
GANESH IMMERSION: గణేశ్ నిమజ్జనంలో ఉద్రిక్తత.. రెండు వర్గాల మధ్య ఘర్షణ - Conflicts between two groups in Ganesh immersion
మాస్కులు లేవు, భౌతిక దూరం పాటించింది లేదు. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తూ గణేశ్ నిమజ్జనాని(GANESH IMMERSION)కి బయలుదేరారు. పోనీ ఆ కార్యక్రమమైనా సరిగా నిర్వర్తించారా అంటే అదీ లేదు. రెండు వర్గాల మధ్య చిన్నపాటి విషయంతో మొదలైన గొడవ.. కొట్లాటకు దారితీసింది. పోలీసులు అడ్డువచ్చినా వారికీ భయపడలేదు. సికింద్రాబాద్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
![GANESH IMMERSION: గణేశ్ నిమజ్జనంలో ఉద్రిక్తత.. రెండు వర్గాల మధ్య ఘర్షణ Conflicts between two groups in Ganesh immersion at secunderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13068391-1092-13068391-1631684010150.jpg)
గణేశ్ నిమజ్జనంలో ఉద్రిక్తత
గణేశ్ నిమజ్జనంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ
ఆ సమయంలో నిమజ్జనాన్ని పర్యవేక్షిస్తున్న అల్వాల్ పోలీసులు.. ఘటనలో జోక్యం చేసుకుని వారిని నివారించే ప్రయత్నం చేశారు. అయినా గొడవ ఆగలేదు. దాడిలో పలువురికి గాయాలయ్యాయి. గొడవకు కారణమైన వారిపై చర్యలు తప్పవని పోలీసులు స్పష్టంచేశారు.
ఇదీ చదవండి:National Sample Survey: ఆ విషయంలో దేశంలోనే తెలంగాణ టాప్.. నేషనల్ సర్వే రిపోర్ట్!