తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ.. ఒకరు మృతి - murder at patigadda news

ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన గొడవలో ఒకరు ప్రాణాలొదిలారు. ఈ ఘటన బేగంపేట పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Conflict between two friends .. One killed at begumpet ps limits
ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ.. ఒకరు మృతి

By

Published : Mar 18, 2021, 3:43 PM IST

బేగంపేట పోలీస్​స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన గొడవలో మోయిన్​ అనే వ్యక్తి మృతి చెందాడు. బేగంపేట పాటిగడ్డలో నివాసం ఉంటున్న ముగ్దుమ్​, మోయిన్​లు స్నేహితులు. బుధవారం రాత్రి వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. మాటా మాటా పెరగడంతో గొడవ కాస్తా పెద్దదై.. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ​ మోయిన్​ తలపై ముగ్దుమ్రాడ్డుతో బలంగా బాదాడు. తలకు తీవ్ర గాయాలైన క్షతగాత్రుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మోయిన్ మృతి చెందాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడు ముగ్దుమ్​​ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చూడండి: దాంపూర్​లో వేటగాళ్ల ఉచ్చులో పడి రైతు మృతి

ABOUT THE AUTHOR

...view details