వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలం జక్కులొద్దులో అర్ధరాత్రి ఆందోళన చెలరేగింది. గుడిసె వాసులు, స్థానికులకు మధ్య తలెత్తిన గొడవ విధ్వంసానికి దారి తీసింది. ఒకరిపై ఒకరు కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ గ్రామంలోని ప్రభుత్వ భూమిలో సుమారు మూడు వందల మంది నిరుపేదలు గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. నిన్న రాత్రి అక్కడే ఓ పానీపూరి బండి వద్ద గుడిసె వాసులు, స్థానికులకు మధ్య చిన్న గొడవ తలెత్తింది. అదే ఈ విధ్వంసానికి దారి తీసింది.
పానీపూరి బండి వద్ద వివాదం.. ఎంతకి దారి తీసిందంటే? - ఇరువర్గాల మధ్య ఘర్షణ
గుడిసె వాసులు, స్థానికులకు మధ్య చెలరేగిన వివాదం చిలికి చిలికి గాలివానలా మారి స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘర్షణలో ఇరువర్గాల వారు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వరంగల్ జిల్లా జక్కులొద్దులో ఈ వివాదం జరిగింది.
CONFLICT BETWEEN THE TWO FACTIONS
ఈ దాడిలో నాలుగు ఆటోలు, మూడు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆందోళన కారులను అదుపులోకి తీసుకొని తరలించడంతో వివాదం సద్దుమనిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గొడవకు దారి తీసిన అంశాలను సేకరిస్తున్నట్లు వెల్లడించారు.
ఇవీ చదవండి:ఫేక్ ఐడీగాళ్ల ఆగడాల 'సాక్షి'గా.. పదోతరగతి విద్యార్థిని బలి..