Two Groups attack: భార్య, భర్తల పంచాయితీ తీవ్రమైన కొట్టుకునేకాడికి దారి తీసింది. మాట మాట పెరిగి ఇరువర్గాలు మూకుమ్మడిగా దాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. తొమ్మిది మందికి గాయాలయ్యాయి. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం ధర్మారంలో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. దంపతుల గొడవలో రాజీ కుదిర్చేందుకు బంధువులతో సమావేశం నిర్వహించగా ఈ ఘర్షణ జరిగింది.
Two Groups attack: దంపతుల పంచాయితీ.. ప్రాణాలు తీసిన ఇరువర్గాల ఘర్షణ - ధర్మారంలో దాడి
18:48 May 05
దంపతుల పంచాయితీలో ఘర్షణ
మాక్లూర్ మండలం కల్లెడ గ్రామానికి చెందిన రమేశ్‌కు నవీపేట్ మండలం ధర్మారం గ్రామానికి చెందిన వసంతతో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు అబ్బాయిలు సంతానం కాగా.. మూడు సంవత్సరాల క్రితం రమేశ్ దుబాయ్‌కి వెళ్లాడు. అప్పటి నుంచి డబ్బులు అత్తమామలకి పంపుతున్నాడని భార్య వసంత పుట్టింటికి వచ్చేసింది. రమేశ్ దుబాయ్ నుంచి వారం క్రితమే ఇంటికి వచ్చాడు. భార్య వసంతను ఇంటికి రమ్మని రమేశ్ కోరాడు. తాను పంచాయితీ పెడితేనే వస్తానని భార్య చెప్పడంతో నిన్న గ్రామానికి చెందిన పెద్దలతో మాట్లాడడానికి రమేశ్ ధర్మారం వచ్చాడు.
ధర్మారంలో పంచాయితీ జరుగుతుండగానే మాటా మాటా పెరిగి ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇటుకలు, రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. అమ్మాయి తరపు బంధువులు ప్రత్యర్థులపై కారం చల్లి చితకబాదారు. ఈ క్రమంలో అబ్బాయి తరఫున పంచాయతీ పెద్దగా వచ్చిన గండికోట రాజన్న(65)కు తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలిస్తుండగానే చనిపోయారు. మృతుడు జక్రాన్‌పల్లి మండలం అర్గుల్ చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ గొడవలో 9 మందికి గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. క్షతగాత్రులు నిజామాబాద్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇవీ చూడండి:ప్రేమ వివాహాన్ని భరించలేకే సరూర్‌నగర్ హత్య: ఎల్బీనగర్ డీసీపీ
బైక్స్ రీడిజైనింగ్‌లో కింగ్.. బాలీవుడ్ స్టార్స్, క్రికెటర్స్ ఫిదా!