రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్టేషన్ పరిధిలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్లో ఘర్షణ చోటుచేసుకుంది. మద్యం తాగాక బిల్లు కట్టమని అడగడం వల్ల వాగ్వాదం జరిగింది. బిల్లు కట్టమని... బార్ యజమానితో గొడవకు దిగారు.
Bar Conflict: తాగిన బిల్లు కట్టమని అడిగినందుకు దాడి - Telangana news
మద్యం తాగాక బిల్లు కట్టమని అడగడం వల్ల వాగ్వాదం (Bar Conflict) చోటుచేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో చోటుచేసుకుంది.
Bar Conflict
మద్యం సేవించిన తర్వాత గొడవ జరిగినట్లు అందులో పనిచేసే వర్కర్లు వాపోయారు. బిల్లు అడిగినందున తమను కర్రలతో బాది పారిపోయారని తెలిపారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి: ఒకేసారి 550 కేక్స్ కట్ చేసి పుట్టిన రోజు వేడుక