భార్య విడాకుల కేసు విషయంలో భూపాలపల్లి పోలీసులు తనను విచక్షణారహితంగా కొట్టారని సికింద్రాబాద్‌లోని ఆల్వాల్‌కు చెందిన రేవంత్... రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించాడు. అల్వాల్ లోతుకుంటాకు చెందిన రేవంత్ 2019 డిసెంబర్లో భూపాలపల్లికు చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నట్లు కమిషన్‌కు తెలిపారు. పెళ్లయ్యాక కొన్నాళ్లకే ఇంట్లో తరచూ గొడవ జరిగేదని పేర్కొన్నారు. ఈ విషయమై పెద్దల ముందు మాట్లాడితే... తన భార్యకు విడాకులు ఇవ్వడానికి రూ.15 లక్షలు చెల్లించాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేశారని ఆరోపించారు.
పోలీసులు కొట్టారని మానవహక్కుల కమిషన్‌లో ఫిర్యాదు - కేసు విషయంలో పోలీసులు కొట్టారని బాధితుడు ఫిర్యాదు
ఓ కేసు విషయంలో తనను పోలీసులు విచక్షణారహితంగా కొట్టారంటూ రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించాడు ఓ వ్యక్తి. సికింద్రాబాద్‌లోని ఆల్వాల్ లోతుకుంటాకు చెందిన అతను భార్యకు విడాకుల విషయంలో రూ.15 లక్షలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. విచారణ పేరుతో భూపాలపల్లి పోలీసులు తనను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విచారణ పేరుతో దాడి చేశారు:
అంత డబ్బులు చెల్లించలేనని చెప్పడంతో... తన భార్య కుటుంబ సభ్యులు భూపాలపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టారని ఫిర్యాదులో తెలిపారు. ఈ కేసు విషయంలో పోలీసులు విచారణకు హాజరు కావాలని పిలవడంతో గత నెల 23న పోలీస్ స్టేషన్‌కు వెళ్లినట్లు వివరించారు. విచారణ పేరుతో ఎస్సై నరేశ్, కానిస్టేబుల్స్ తనను చిత్రహింసలకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబ సభ్యులందరిపై కేసులు నమోదు చేస్తానని అసభ్య పదజాలంతో దూషించారని తెలిపారు. తప్పు చేస్తే తనను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపకుండా సెటిల్మెంట్ చేసుకోవాలని దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను రేవంత్ కోరారు.