తొమ్మిదేళ్ల బాలికను అత్యాచారం చేసి హతమార్చిన నిందితున్ని కఠినంగా శిక్షించాలని.. పలు గిరిజన సంఘాలు, బాధిత తల్లిదండ్రులు రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈనెల 23న సైదాబాద్ పీఎస్ పరిధిలోని ఖాజాభాగ్లో జీవనోపాధి కొనసాగిస్తున్న జ్యోతి, సెవ్యానాయక్లకు ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు.
9ఏళ్ల బాలిక అత్యాచార ఘటనపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు
సైదాబాద్ ఠాణా పరిధిలో ఐఎస్ సదన్‌లో జరిగిన తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు కోరారు. బాధిత తల్లిదండ్రులు రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు.
రోజువారి మాదిరిగానే కూలిపనికి వెళ్లిన తల్లిదండ్రులు పని ముగించుకుని ఇంటికి రాగానే తమ 9 ఏళ్ల కూతురు విగతజీవిగా ఒంటిపై బట్టలు లేకుండా పలు గాయాలతో పడి ఉందని కమిషన్ ముందు బాధిత తల్లిదండ్రులు తమ గోడు విన్నవించుకున్నారు. తమ కూతురు మెడపై ఉరేసిన గుర్తులున్నాయని.. ఆత్మహత్యపై కనీస అవగాహన లేని తన కూతురు ఉరేసుకుంటుందా అని ప్రశ్నించారు. తాము ఇంట్లో లేమని తెలుసుకున్న పక్కింటి అబ్బాయి షేక్ మస్తాన్(20) ఇంట్లో చొరబడి అత్యాచారం చేసి... చంపారని అనుమానం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇంట్లో శ్రీనిధి ఉరివేసుకొని చనిపోయిందని మొదటగా చూసి చెప్పింది అతనేనని... పేర్కొన్నారు.
షేక్ మస్తాన్ అత్యాచారం చేసి చంపి... ఉరివేసుకుందని కట్టుకథలు సృష్టించాడని... అతనిని వెంటనే అరెస్ట్ చేసి విచారణ చేపట్టాలని కోరారు. లోతైన విచారణ జరపాలని... పోలీసులను కోరిన్నప్పటికీ వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ... ఈ కేసును నీరుగార్చుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే షేక్ మస్తాన్‌పై అత్యాచారం, హత్యకేసుతో పాటు... ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించి... తమకు న్యాయం చేయాలని బాధిత తల్లిదండ్రులు వేడుకున్నారు.