అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అనుచరులపై పీఠాధిపతి శివనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీ విజయ మహాలక్ష్మి పీఠం హోస్‌పేట పీఠాధిపతి శివనారాయణ.. ఎమ్మెల్యే కాపు అనుచరులు తమను బెదిరిస్తున్నారని జిల్లా ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 4 హెక్టార్లలో మైనింగ్ ఆదాయాన్ని పీఠం అభివృద్ధికి వెచ్చిస్తున్నామన్న పీఠాధిపతి.. మైనింగ్ భూమిని వదిలేసి వెళ్లాలని తనపై ఒత్తిడి తెస్తున్నారని వివరించారు. సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు.
రాయదుర్గం ఎమ్మెల్యే అనుచరులపై పీఠాధిపతి ఫిర్యాదు - ఎమ్మెల్యే కాపు అనుచరులపై పీఠాధిపతి ఫిర్యాదు
రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అనుచరులపై జిల్లా ఎస్పీకి శ్రీ విజయ మహాలక్ష్మి పీఠం హోస్‌పేట పీఠాధిపతి శివనారాయణ ఫిర్యాదు చేశారు. మైనింగ్ భూమిని వదిలేసి వెళ్లాలని తమను బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
complaint on rayadurgam mla