సంగారెడ్డి జిల్లాలోని రెండు గ్రామ పంచాయతీల సర్పంచ్, ఉప సర్పంచ్‌లను కలెక్టర్ హనుమంతరావు ఆరు నెలల పాటు తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేట గ్రామ సర్పంచ్ కృష్ణ, ఉప సర్పంచ్ ఎండీ పయీమ్, పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామ పంచాయతీ సర్పంచ్ నర్సింహ, ఉపసర్పంచ్ శివకుమార్లను సస్పెండ్ చేశారు. గ్రామ పంచాయతీల పరిధిలోని అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించినందుకు ఆరు నెలల పాటు పదవుల నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అక్రమ నిర్మాణాలు.. సర్పంచ్, ఉపసర్పంచ్‌లపై కలెక్టర్ వేటు - సంగారెడ్డి లేటెస్ట్ అప్డేట్స్
అక్రమ నిర్మాణాలకు సహకరించినందుకు రెండు గ్రామాల సర్పంచ్, ఉప సర్పంచ్‌పై వేటు వేశారు. కిష్టారెడ్డిపేట, ఇంద్రేశం గ్రామాల సర్పంచ్‌లను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
కిష్టారెడ్డిపేట గ్రామపంచాయతీ పరిధిలో 62 అక్రమ నిర్మాణాలు గుర్తించామని... వీటిలో 24 అక్రమ నిర్మాణాల అదనపు అంతస్తుల గోడలను కూల్చివేసినట్లు వెల్లడించారు. ఇంద్రేశం గ్రామ పరిధిలోని 56 అక్రమ నిర్మాణాల్లో 10 నిర్మాణాలను కూల్చివేశామన్నారు. వీటితోపాటు పటేల్ గూడా గ్రామపంచాయతీలో నాలుగు అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు చెప్పారు. అక్రమ నిర్మాణాలు చేపబడితే కఠిన చర్యలు ఉంటాని హెచ్చరించారు. అక్రమ నిర్మాణాలను కొనుగోలు చేయకూడదని ప్రజలకు సూచించారు. సర్పంచులు, ఉప సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు అక్రమ నిర్మాణాలు లేఅవుట్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు.