తెలంగాణ

telangana

ETV Bharat / crime

Collector Amoy Kumar Suspended Six Officers : ఆరుగురు అధికారుల సస్పెన్షన్‌.. కలెక్టర్ అమోయ్ ఆదేశాలు - రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్

విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఆరుగురు అధికారులను రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌ గురువారం సస్పెండ్‌ చేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో నిర్లక్ష్యం వహించినందుకు వీరిని సస్పెండ్ చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపారు.

Collector Amoy Kumar Suspended Six Officers
Collector Amoy Kumar Suspended Six Officers

By

Published : Jan 21, 2022, 8:56 AM IST

రంగారెడ్డి జిల్లాలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఆరుగురు అధికారులను సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ తెలిపారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో నిర్లక్ష్యం వహించినందుకు వీరిని సస్పెండ్ చేసినట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. విధుల్లో అలసత్వం చూపిన శంషాబాద్‌ ఎంపీడీవో వినయ్‌కుమార్‌, ఇబ్రహీంపట్నం ఎంపీడీవో మహేశ్‌బాబు, అక్రమ కట్టడాలకు అనుమతి ఇచ్చిన శంషాబాద్‌ ఎంపీడీవో సురేందర్‌రెడ్డిని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

విధుల్లో నిర్లక్ష్యం వహించిన షాబాద్‌ ఏపీవో వీరాసింగ్‌, ఎక్స్‌ఈసీ పి.పవన్‌కుమార్‌, మంచాల ఏపీవో కె.వీరాంజనేయులపైనా సస్పెన్షన్‌ వేటు వేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ABOUT THE AUTHOR

...view details