నిజామాబాద్‌లోని ముప్కాల్ మండల కేంద్రంలో లక్ష్మీ నరసింహ కోచింగ్ సెంటర్ నిర్వాహకులు విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు వెళ్లేసరికి అక్కడ చిన్నారులకు పాఠాలు చెబుతున్నారు. దీనిపై మండల విద్యాశాఖ అధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోచింగ్ సెంటర్‌ను శాశ్వతంగా మూసివేయాలని సూచించారు.
నిబంధనలు తుంగలో తొక్కిన కోచింగ్ సెంటర్
నిజామాబాద్‌లో ఓ వైపు కరోనా విజృంభిస్తుంటే... ప్రభుత్వ నిబంధనలు మరిచి ఓ కోచింగ్ సెంటర్ నిర్వాహకులు పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నిబంధనలు తుంగలో తొక్కుతూ పాఠాలు చెప్పేందుకు సిద్ధమయ్యారు.
నిబంధనలు తుంగలో తొక్కిన కోచింగ్ సెంటర్
ప్రభుత్వ జీవోను ఉల్లంఘించిన కోచింగ్ సెంటర్‌ను మూసివేశారు. సంబంధిత మెమోను యాజమాన్యానికి అందజేశారు. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే వారిపై సమీప పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులు పెట్టేందుకు కూడా వెనకాడేది లేదని డీఈఓ బట్టు రాజేశ్వర్ హెచ్చరించారు.
ఇదీ చూడండి:రాష్ట్రాల నుంచి ప్రజల రాకపోకలు... జిల్లాల్లో పెరుగుతున్న కేసులు