తెలంగాణ

telangana

ETV Bharat / crime

ప్రేమోన్మాది చేతిలో యువతి హత్య ఘటన.. కఠిన చర్యలకు సీఎం ఆదేశం..

ఏపీలో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన ఘటనపై ఆ రాష్ట్ర సీఎం జగన్​ స్పందించారు. హత్యకు కారకుడైన వ్యక్తిపై దిశ చట్టం కేసు పెట్టాలని అధికారులను ఆదేశించారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. అటు మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ.. మృతురాలి కుటుంబాన్ని ఆదుకుంటామని వెల్లడించారు. నిందితుడిపై రౌడీషీట్‌ తెరుస్తామని కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు తెలిపారు.

ప్రేమోన్మాది చేతిలో యువతి హత్య ఘటన.. కఠిన చర్యలకు సీఎం ఆదేశం..
ప్రేమోన్మాది చేతిలో యువతి హత్య ఘటన.. కఠిన చర్యలకు సీఎం ఆదేశం..

By

Published : Oct 9, 2022, 10:30 AM IST

ప్రేమోన్మాది చేతిలో యువతి హత్య ఘటన.. కఠిన చర్యలకు సీఎం ఆదేశం..

ఆంధ్రప్రదేశ్​లోని కాకినాడ జిల్లా కాండ్రేగుల కూరాడలో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన దేవకి ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దిశ చట్టం ప్రకారం నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. నేరం చేసిన వ్యక్తికి కఠిన శిక్ష పడేలా తగిన చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. బాధిత కుటుంబానికి అండగా ఉండాలని సూచించారు.

మరోవైపు యువతి కుటుంబసభ్యులను.. ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. మహిళా కమిషన్ తరఫున మృతురాలి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. యువతిని హత్య చేసిన నిందితుడు సూర్యనారాయణపై రౌడీషీట్‌ తెరుస్తామని కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు తెలిపారు. నిందితుడికి కఠినశిక్ష పడేలా చూస్తామన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details