ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం జీరుపాలెంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చిన ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు యత్నించిన పోలీసులపై కొందరు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ప్రత్యర్థి వర్గానికి చెందిన కొందరికి గాయాలయ్యాయి.
పల్లె పోరు: ఇరువర్గాల ఘర్షణ.. పోలీసుల లాఠీఛార్జ్ - ap news
ఏపీలోని శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం జీరుపాలెంలో ఇరు వర్గాల ఘర్షణతో.. తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులపైనా రాళ్లు రువ్వేంత వరకు వెళ్లింది. చివరికి... పోలీసులు లాఠీఛార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
![పల్లె పోరు: ఇరువర్గాల ఘర్షణ.. పోలీసుల లాఠీఛార్జ్ ap local body elections, srikakulam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10718215-682-10718215-1613905993600.jpg)
ఏపీ పంచాయతీ ఎన్నికలు, శ్రీకాకుళం
పరిస్థితి అదుపు తప్పకుండా గట్టి చర్యలు తీసుకున్న పోలీసులు... రెండు వర్గాలను అక్కడి నుంచి వెళ్లగొట్టారు.
పల్లె పోరు: ఇరువర్గాల ఘర్షణ.. పోలీసుల లాఠీఛార్జ్
ఇదీ చదవండి:కేటీఆర్ పీఏనంటూ డబ్బులు డిమాండ్