ప్రగతిభవన్‌కు కూతవేటు దూరంలో ఉన్న పబ్‌లో రెండు గ్రూపుల మధ్య జరిగిన గొడవ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రగతిభవన్ సమీపంలోని బేగంపేట క్లబ్ 8లో మద్యం మత్తులో ఉన్న రెండు గ్రూపుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. బీరు సీసాలతో ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడి చేసుకున్నారు. గొడవ జరుగుతున్న సమయంలో పక్క టేబుల్‌లో కూర్చున్న విన్‌స్టన్ జాన్ అనే వ్యక్తి కుడి కంటికి పగిలిన సీసా పెంకులు తగిలాయి. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు.
Fight in pub: పబ్‌లో ఘర్షణ.. బీరు సీసాలతో కొట్టుకున్న రెండు వర్గాలు - clashes between two groups in club 8
ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో బీరుసీసాలతో రెండు వర్గాలు పరస్పరం కొట్టుకున్నాయి. ఘర్షణలో బీరు సీసా తగిలి ఓ వ్యక్తి కంటికి తీవ్ర గాయమైంది. సమాచారం అందుకున్న పోలీసులు సీసీ విజువల్స్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
![Fight in pub: పబ్‌లో ఘర్షణ.. బీరు సీసాలతో కొట్టుకున్న రెండు వర్గాలు clashes in club 8](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13258927-795-13258927-1633353947655.jpg)
క్లబ్ 8లో గొడవ
గమనించిన పబ్ యాజమాన్యం చికిత్స నిమిత్తం బాధితుడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం వైద్యులు బంజారాహిల్స్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి పంపించారు. బాధితుడిని పరీక్షించిన కంటి వైద్యులు శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుందని సూచించారు. సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. పబ్‌లో ఏర్పాటు చేసిన సీసీ టీవీలో నిక్షిప్తమైన దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:special commissioner: జంటనగరాల్లోని చెరువుల పరిరక్షణ కోసం ప్రత్యేక కమిషనర్