తెలంగాణ

telangana

ETV Bharat / crime

"విగ్రహాల విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ".. అడ్డుకున్న పోలీసులు! - విగ్రహాల విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ

Clash Between Two Communities: రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ , బాబూ జగ్జీవన్‌రామ్​ విగ్రహాలు పెట్టడంపై రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లా ఫిరంగీపురం మండలం నుదురుపాడు గ్రామంలో చోటుచేసుకుంది.

"విగ్రహాల విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ".. అడ్డుకున్న పోలీసులు!
"విగ్రహాల విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ".. అడ్డుకున్న పోలీసులు!

By

Published : Apr 14, 2022, 10:05 PM IST

Clash Between Two Communities: ఏపీలోని గుంటూరు జిల్లా ఫిరంగీపురం మండలం నుదురుపాడు గ్రామంలో దళితులకు చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. నుదురుపాడులోని కమ్యూనిటీ హాల్ స్థలంలో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్, బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహాలు పెట్టేందుకు ఒక వర్గం పూనుకుంది. అక్కడే ఉన్న దళితులకు చెందిన మరొక వర్గం దానికి అభ్యంతరం తెలిపింది. దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం రాజుకొంది. ఒకరిపై ఒకరు చెప్పులతో దాడి చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని, ఇరు వర్గాలను చెదరగొట్టారు. అనంతరం.. పోలీసులు అక్కడ నుంచి రెండు విగ్రహాలు తరలించే సమయంలో ఒక వర్గం అభ్యంతరం తెలిపింది. అయితే.. విగ్రహాలు పెట్టేందుకు అనుమతి తీసుకోవాలని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details