చోరీ సొత్తు పంపకాల్లో తేడాలు రావటంతో... సహచరులే యువకుడి గొంతు కోశారు. ఈ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలోని గోదాముల వద్ద జరిగింది.
దగ్గుబాటి రాజశేఖర్, శ్రీను కలిసే దొంగతనాలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఓ చోట అపహరించిన బంగారు గొలుసు పంపకం విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. రాజశేఖర్ మరో ఇద్దరు యువకులతో కలిసి శ్రీనుపై దాడి చేశాడు. కత్తితో శ్రీను గొంతు కోశాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన శ్రీనుని గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు.. శ్రీనుని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం బాధితుడిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శ్రీను పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.