Clash between students in Khammam district: ఖమ్మం జిల్లాలోని బస్టాండ్ దగ్గర కళాశాల విద్యార్థులు ఒకరిపై ఒకరూ దాడి చేసుకున్నారు. సీనియర్ ఇంటర్ విద్యార్థిపై బంధువులతో కలిసి జూనియర్ ఇంటర్ విద్యార్థి కర్రలతో దాడి చేశాడు. కాలేజ్ వదిలిన తరువాత విద్యార్థి కోసం వేచి చూసిన దుండగులు ఈ దాడి చేశారు. ఈ ఘర్షణలో సీనియర్ ఇంటర్ విద్యార్థికి తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు.
కళాశాల విద్యార్థుల మధ్య ఘర్షణ.. ఎక్కడంటే! - ఖమ్మం తాజా సమాచారం
Clash between students in Khammam district: కాలేజ్లో జరిగిన చిన్న చిన్న గొడవలే ఘర్షణలకు దారి తీస్తాయి. అసలు కళాశాల జీవితం అంటేనే కొంత మంది విద్యార్థులు గొడవలు పడుతూ.. చదువుకోవడం అనుకొంటారు. ఆ విధంగానే కొత్తగూడెం జిల్లాలో కాలేజ్ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది.
విద్యార్థుల గొడవ
నిన్న కాలేజ్లో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ దీనికి కారణమని సమాచారం. గాయాలు పాలైన విద్యార్థి నగరంలోని ఓ ప్రజా ప్రతినిధి కొడుకు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: