Clash Between B.Tech Students: ప్రేమించిన యువతి విషయంలో కొందరు యువకులు.. మరో యువకుడిని చావబాదిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో చోటుచేసుకుంది. భీమవరం ఎస్ఆర్కేఆర్ కళాశాలలో ఇంజినీరింగ్ రెండో ఏడాది చదువుతున్న విద్యార్థులు.. ఓ యువతి విషయంలో గొడవపడ్డారు. ఈ క్రమంలో ప్రవీణ్ అనే యువకుడు.. మరో ముగ్గురు యువకులతో కలిసి అంకిత్ అనే యువకుడిని చితకబాదారు. కర్రలు, పైపులతో విచక్షణారహితంగా కొట్టారు. ఘటనపై భీమవరం రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాధిత విద్యార్థిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చదవండి..: