హైదరాబాద్‌లో సీసీఎస్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న రాజును వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేశారు. రాత్రి వనస్థలిపురం పరిధిలో నిర్మానుష్య ప్రాంతంలో కారులో ఓ యువతితో ఏకాంతంగా సీఐ ఉండటాన్ని చూసిన భార్య ఇద్దరు పిల్లలతో అక్కడికి వెళ్లి గొడవపెట్టుకుంది. ఇది గమనించిన పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా.. సీఐ రాజు కానిస్టేబుల్‌పై దాడి చేసి..సెల్‌ఫోన్ పగులగొట్టాడు. దీంతో పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చిన కానిస్టేబుళ్లు మరో పోలీస్ వాహనంలో వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
నేను ఇన్‌స్పెక్టర్‌ని.. నన్నే వీడియో తీస్తావా:రాజు మరో మహిళతో ఉండడాన్ని చూసిన భార్య, కుటుంబ సభ్యులు ఆయనతో గొడవకు దిగారు. అర్ధరాత్రి 1 గంట సమయంలో అరుపులు వినిపించడంతో గస్తీలో ఉన్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కానిస్టేబుల్ రామకృష్ఱ, హోంగార్డు నాగరాజు నాయుడులు ఈ గొడవను వీడియో తీసేందుకు ప్రయత్నించారు. ఇది గమనించిన రాజు.. ‘‘నేను ఇన్‌స్పెక్టర్‌ను.. నన్నే వీడియో తీస్తావా..’’అంటూ ఆగ్రహంతోఊగిపోయాడు. అసభ్యంగా మాట్లాడుతూ దాడికి దిగాడు. కానిస్టేబుల్ రామకృష్ణ ముఖంపై కొట్టడంతో తీవ్ర రక్తస్రావమైంది. ఈ విషయాన్ని ఆయన ఉన్నతాధికారులకు చెప్పడంతో మరో వాహనంలో వనస్థలిపురం ఇన్‌స్పెక్టర్‌తో పాటు సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మద్యం మత్తులో ఉన్న ఇన్‌స్పెక్టర్ రాజు, మహిళ, కుటుంబసభ్యులను ఠాణాకు తరలించారు. రాజుకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష చేసేందుకు ప్రయత్నించినా సహకరించలేదు. శుక్రవారం ఉదయం రక్త పరీక్ష కోసం నమూనాలు సేకరించారు. కానిస్టేబుల్ రామకృష్ణ, హోంగార్డు నాగరాజుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. భర్త వ్యవహారంపై ఇచ్చిన ఫిర్యాదును ఆయన భార్య వెనక్కి తీసుకున్నారని చెప్పారు.