జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇటిక్యాల మండలం జింకలపల్లి గ్రామంలో భారీ చోరి జరిగింది. వెంకటేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి కుటుంబసభ్యులతో కలిసి స్థానికంగా నివాసముంటున్నాడు. వేసవి కాలం ఉక్కబోత భరించలేక అందరూ కలిసి మేడపై నిద్రించేందుకు వెళ్లారు.
పడుకునేందుకు డాబా మీదకు వెళ్లారు... తిరిగి వచ్చేసరికి ఇళ్లు గుళ్ల చేశారు - తస్కరించారు
వేసవి ఉక్కబోత తాళలేక ఇంటిపైకి పడుకునేందుకు వెళ్లారు ఆ కుటుంబసభ్యులు. ఉదయం కిందకి వచ్చిన వారు ఇంటిని చూసి షాక్ అయ్యారు. చోరీ జరిగిందని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన జోగులాంబలో చోటు చేసుకుంది.
పడుకునేందుకు డాబా మీదకు వెళ్లారు... తిరిగి వచ్చేసరికి ఇళ్లు గుళ్ల చేశారు
ఇదే అదనుగా భావించిన దొంగలు ఇంట్లోకి ప్రవేశించి లాకర్లోని సొత్తును కాజేశారు. ఉదయం కిందకి వచ్చిన కుటుంబసభ్యులు చోరీ జరిగినట్లు గుర్తించి... పోలీసులకు సమాచారం అందించారు. 30 తులాల బంగారం, అరకిలో వెండి, 30 వేల నగదు పోయినట్లు గుర్తించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సాయంతో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఈశ్వరయ్య తెలిపారు.
ఇదీ చూడండి:అక్రమంగా బంగారం, విదేశీ కరెన్సీ తరలింపు.. అధికారుల స్వాధీనం