Chits Fraud Case: సంగారెడ్డి జిల్లాలో చిట్టిల పేరుతో భారీ మోసానికి పాల్పడిన రమాదేవిని పటాన్చెరు పోలీసులు ఈరోజు కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆమెకు 14రోజుల రిమాండ్కు విధించడంతో చంచల్గూడ జైలుకు తరలించారు. బాధితుల కళ్లుగప్పి భర్తతో కలిసి ఇన్ని రోజులు పరారీలో ఉన్న ఆమె.. ఈ నెల 13వ తేదీన పోలీసుల ఎదుట లొంగిపోయింది. న్యాయస్థానం అనుమతితో 3రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు తిరిగి ఇవాళ కోర్టులో హాజరుపరిచారు. ఆమె ఆస్తులకు సంబంధించి పలు పత్రాలు, రూ. 50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
చిట్టీల పేరుతో భారీ మోసం.. నిందితురాలికి 14 రోజులు రిమాండ్
Chits Fraud Case: సంగారెడ్డి జిల్లాలో చిట్టీల పేరుతో భారీ మోసానికి పాల్పడిన రమాదేవిని పోలీసులు ఈరోజు కోర్టులో హాజరుపరిచి 14 రోజుల రిమాండ్కు తరలించారు. సుమారు 135 మంది నుంచి రూ.9 కోట్లు రూపాయలు చిట్టిల పేరుతో వసూళ్లు చేసిన రమాదేవి.. బాధితులకు దొరక్కకుండా ఐదు నెలలు పరారీలో ఉన్నారు.
ఇది జరిగింది:బాధితుల కథనం ప్రకారంసంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామం సాయి ప్రియ కాలనీలకు చెందిన రమాదేవి చిట్టీల పేరుతో దాదాపు 135 మంది వద్ద డబ్బులు కట్టించుకుని సొమ్ము తిరిగి ఇవ్వకుండా వడ్డీ ఇస్తానంటూ కాలయాపన చేసింది. చివరకు బాధితులు నిలదీయడంతో భర్తతో కలిసి పరారైంది. దీంతో చిట్టీలు కట్టించుకుని రూ.9 కోట్లు ఇవ్వకుండా మోసం చేసి రమాదేవి పరారైనట్లు.. పటాన్చెరు పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమె భర్త ఇంకా పరారీలోనే ఉన్నాడు.
ఇవీ చదవండి: