Chinoutpalli Accident: ఏపీలోని కృష్ణా జల్లా గన్నవరం మండలం చిన్నఅవుటపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు రోడ్డుపై పడిపోయిన వాళ్ల పైనుంచి ఓ లారీ వెళ్లిపోయిన ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఓ మహిళ తీవ్రంగా గాయపడింది.
Chinoutpalli Accident: ముగ్గురి పైనుంచి దూసుకెళ్లిన లారీ.. ఇద్దరు దుర్మరణం - lorry collide two died
ప్రమాదవశాత్తు రోడ్డుపై పడిపోయిన వాళ్ల పైనుంచి ఓ లారీ వెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ ప్రమాదం ఏపీలోని కృష్ణా జిల్లా చిన్న అవుటపల్లి వద్ద జరిగింది.
ap news
చిన్నఅవుటపల్లి వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని.. ద్విచక్రవాహనదారుడు ఢీకొట్టాడు. ఈ క్రమంలో బైకుపై ఉన్న వాళ్లు రహదారిపై పడిపోయారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ లారీ.. రోడ్డుపై పడిపోయిన ముగ్గురి పైనుంచి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో మహిళ గాయపడింది. స్థానికులు ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది.
ఇదీ చూడండి:boy fell on manhole ring : మ్యాన్హోల్రింగ్పై పడి మృతిచెందిన బాలుడు