తెలంగాణ

telangana

ETV Bharat / crime

ప్రైవేట్​ స్కూల్​ బస్సు ఢీకొన్న ఘటనలో ఇద్దరు చిన్నారుల మృతి.. - స్కూల్​ బస్సు ప్రమాదం

Bus accident: నడుచుకుంటూ వెళ్తున్న చిన్నారులను ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీ కొట్టిన ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

bus accident
బస్సు ప్రమాదం

By

Published : Sep 13, 2022, 2:52 PM IST

Childrens dead: ఎక్కడో బిహార్​ నుంచి పొట్టకూటి కోసం ఇక్కడకు వచ్చారు. కొన్ని సంవత్సరాలుగా వలస కార్మికులుగా జీవనం సాగిస్తున్నారు. ఇంతలోనో ఉన్నట్టుండి జరిగిన రోడ్డు ప్రమాద ఘటన ఆ కుటుంబాల జీవితాల్లో తీవ్రవిషాదాన్ని నింపింది. ఈ ప్రమాదం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని శేరిగుడా-సాగర్ రహదారిపై జరిగింది.

రహదారిపై ఉన్న దుకాణానికి వెళ్లిన కాజల్​, అభిషేక్​లను ఆంగ్లిస్టు ప్రైవేట్​ స్కూల్ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో కాజల్​(12) అక్కడికక్కడే మృతి చెందగా, అభిషేక్​ పరిస్థితి విషమంగా ఉండడంతో హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

వీరిది బిహార్ రాష్ట్రంలోని బాబువ జిల్లా, ఆకాలసపూర్​ గ్రామానికి చెందిన వలస కార్మికులుగా పోలీసులు గుర్తించారు. గత కొన్ని సంవత్సరాలుగా కవిత రైస్​ మిల్​లో కార్మికులుగా పనిచేస్తున్నారు. బతుకుతెరువు కోసం వచ్చి, పిల్లలను కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతుల కుటుంబానికి తగిన న్యాయం చేయాలని రహదారిపై బిహార్​ వాసులు బైఠాాయించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details