Children fell into the pond and died: రేగొండ మండలం దుంపిల్లపల్లి గ్రామానికి చెందిన తాటికంటి రమేశ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. గురువారం దశ దిన కర్మ నిర్వహిస్తుండగా మొగుళ్లపల్లి గ్రామానికి చెందిన గుండాల సురేశ్-భాగ్యలక్ష్మి దంపతులతో పాటు వారి కుమారుడు వర్షిత్(9), కమలాపురం మండలం గుండెడు గ్రామానికి చెందిన కోటేశ్వర్రావు-రాణి దంపతులు కొడుకు పరశురామ్(11)తో కలిసి వచ్చారు.
బహిర్భూమికి వెళ్లి కుంటలో పడి చనిపోయిన చిన్నారులు - Regonda SI Srikanth Reddy
Children fell into the pond and died: బహిర్భూమికి వెళ్లి ఇద్దరు చిన్నారులు కుంటలో పడి చనిపోయిన ఘటన... జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం దుంపిళ్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. చిన్నారులు ఇద్దరు కలిసి బహిర్భూమికి వెళ్లగా ప్రమాదవశాత్తు కుంటలో పడి మరణించారు.
Children fell into the pond and died
మృతుడు రమేశ్ ఇంటి సమీపంలో ఉన్న కుంట వద్దకు వీరి పిల్లలు బహిర్భూమికి వెళ్లగా ప్రమాదవశాత్తు జారి పడిపోయారు. ఈత రాకపోవడంతో మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు రేగొండ ఎస్సై శ్రీకాంత్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికి తీయించారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: