తెలంగాణ

telangana

ETV Bharat / crime

Child Sexual Abuse: 'అమ్మా నాకు నొప్పి వస్తోంది.. ఆ అంకుల్​ ఏదో చేశాడు' - చిన్నారిపై అత్యాచారయత్నం

మూడేళ్ల చిన్నారి... చాలా బాధతో తన వద్దకు వెళ్లి అమ్మా.. నాకు నొప్పి వస్తుంది అని చెప్పింది. ఎక్కడ ఏమైంది అంటూ తల్లి దగ్గరకు తీసుకోగా.. జరిగిన దారుణాన్ని తనకు వచ్చి రాని మాటలతో చెప్పింది. అసలేమి జరిగిందంటే..

Child Sexual Abuse
అత్యాచారయత్నం

By

Published : Oct 7, 2021, 10:04 AM IST

Updated : Oct 7, 2021, 12:39 PM IST

నిర్మల్ జిల్లా కేంద్రంలో చిన్నారిపై స్థానికంగా ఉండే వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు. గోల్డెన్​ ఫంక్షన్​ హాల్​ సమీపంలో ఈ దారుణం చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే ఓ కుటుంబానికి చెందిన మూడేళ్ల చిన్నారి తన తల్లి వద్దకు వెళ్లి అమ్మా చాలా నొప్పిగా ఉందంటూ బోరున ఏడ్చింది. కంగారు పడిన తల్లి ఏమైందమ్మా అని అడగ్గా జరిగిందంతా చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

ఫంక్షన్ హాల్​ సమీపంలో చిన్నారి... ఇద్దరు బాలికలతో ఆడుకుంటుండగా స్థానికంగా నివాసముండే నారాయణ (45) అక్కడకు వచ్చాడు. చాక్లెట్ ఇస్తానని చెప్పి ఆమెను అక్కడి నుంచి తీసుకు వెళ్లాడు. సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి చిన్నారిపై అత్యాచారం చేయబోయాడు. చిన్నారి ఏడవడంతో అక్కడే ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. ఇంటి దగ్గర్లోని ప్రదేశం కావడంతో చిన్నారి క్షేమంగా ఇంటికి చేరుకుంది. చాలా నొప్పిగా ఉందని ఏడుస్తూ తల్లికి జరిగిందంతా చెప్పింది.

విషయాన్ని గ్రహించిన చిన్నారి కుటుంబీకులు, బంధువులు నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పజెప్పారు. ఈ విషయం పట్టణమంతా తెలిసిపోవడంతో వారందరూ పోలీసు స్టేషన్​కు వచ్చి ఆందోళనకు దిగారు. నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు.

పోక్సోతో పాటు పలు సెక్షన్ల

నిందితుడిని అరెస్టు చేసినట్లు అదనపు ఎస్పీ రామ్ రెడ్డి తెలిపారు. నారాయణపై పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి జైలుకు తరలించినట్లు వెల్లడించారు. చిన్నారి కుటుంబసభ్యులను అన్ని విధాలుగా ఆదుకొని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి:

Last Updated : Oct 7, 2021, 12:39 PM IST

ABOUT THE AUTHOR

...view details