Child murder case in Nalgonda district: నల్గొండ జిల్లా నార్కట్పల్లి పట్టణంలో చిన్నారి మృతి కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈనెల 14 న రెండేళ్ల వయస్సున్న ప్రియాన్షిక ఫిట్స్ వచ్చి చనిపోయిందని పోలీసులకు సమచారం అందింది. పరిశీలించగా గొంతు మీద గాయాలు ఉండడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. దర్యాప్తులో పోలీసులు ఆశ్చర్యపోయే విషయం వెలుగుచూసింది.
డీఎస్పీ నరసింహా రెడ్డి కథనం ప్రకారం ఉయ్యాల వెంకన్నకు, చెట్ల రమ్యకి 2017లో వివాహం అయింది. వారికి శివరాం(5), ప్రియాన్షిక(2) ఇద్దరు పిల్లలున్నారు. వెంకన్న 2020లో కరోనాతో చనిపోయాడు. ఆ తరువాత రమ్య ఇద్దరు పిల్లలతో అత్తవారింట్లోనే ఉండేది. అదే గ్రామానికి చెందిన పెరిక వెంకన్నతో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
పెరికి వెంకన్నకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరి మధ్య వ్యవహారం ఆమె అత్తమామలకు తెలిసింది. దీంతో వారు గ్రామ పెద్ద మనుషుల సమక్షంలో సమస్యను పరిష్కరించమని కోరగా వారిద్దరిని హెచ్చరించారు. అయిన వారిలో ఎటువంటి మార్పు రాలేదు. రమ్య, వెంకన్న ఊరి విడిచి చిట్యాలలో రూం అద్దెకు తీసుకున్నారు.