Infant missing: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వాస్పత్రుల్లో వరుసగా చిన్నారుల అదృశ్యం కలకలం రేపుతోంది. విశాఖ కేజీహెచ్‌లో పసికందు అదృశ్యం కేసు ఛేదించి 24 గంటలైనా గడవకముందే పోలీసులకు మరో సవాల్ ఎదురైంది. చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో పసికందు అదృశ్యమైన ఘటన కలవరపెడుతోంది. చిన్నారి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆస్పత్రి ప్రాంగణంలో వెతికారు. ఎంత సేపటికీ నవజాత శిశువు కనిపించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
Infant missing: ప్రభుత్వాస్పత్రిలో కలకలం.. పసికందు అదృశ్యం
Infant missing: ఏపీలోని చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో పసికందు అదృశ్యమైంది. చిన్నారి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. పసికందు మాయంపై.. జాయింట్ కలెక్టర్ శ్రీధర్ విచారణకు ఆదేశించారు.
చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో పసికందు అపహరణ
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. మరోవైపు ఈ ఘటనపై జేసీ శ్రీధర్ విచారణకు ఆదేశించారు.
ఇదీ చదవండి:హోలీ పేరుతో స్నేహితుని పట్ల సైకోయిజం.. బ్లేడ్‌తో గాట్లు పెట్టి పైశాచికానందం..