తెలంగాణ

telangana

ETV Bharat / crime

చిన్నారిని బలిగొన్న పోలీసుల అత్యుత్సాహం - కళ్యాణదుర్గం వార్తలు

ఏపీ పోలీసుల అత్యుత్సాహం.. ఓ చిన్నారి ప్రాణాలను బలిగొంది. తొలిసారిగా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఉషశ్రీ చరణ్ ఊరేగింపు సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా... వాహనం ఊరేగింపులో చిక్కుకుపోయింది. సకాలంలో వైద్యం అందక చిన్నారి మృతిచెందింది.

died
died

By

Published : Apr 16, 2022, 9:52 AM IST

ఏపీ అనంతపురం జిల్లాలో పోలీసుల అత్యుత్సాహం.. ఓ చిన్నారి ప్రాణాలను బలిగొంది. మంత్రిగా బాధ్యతలు తీసుకొని తొలిసారి నియోజకవర్గానికి వస్తుందని.. కళ్యాణదుర్గంలో మంత్రి ఉషశ్రీ చరణ్ ఊరేగింపు సందర్భంగా ఆ మార్గంలో పోలీసులు.. వాహనాలను నిలిపివేశారు. అదే సమయంలో శెట్టూరు మండలం చెర్లోపల్లికి చెందిన ఈరక్క, గణేష్​ల కూతురు పండు అనే 8 నెలల చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. ఆ వాహనం ట్రాఫిక్​లో నిలిచిపోయింది. ముందుకు వెళ్లేందుకు మరో మార్గం లేకపోవటంతో... ఆ చిన్నారి మృతి చెందింది.

బాలిక మృతిపై కుటుంబసభ్యుల ఆందోళన చేపట్టారు. పోలీసులు అత్యుత్సాహంతోనే తమ కూతురు చనిపోయిందిని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు.

ఇవీ చూడండి..

ABOUT THE AUTHOR

...view details