తెలంగాణ

telangana

ETV Bharat / crime

TEENMAR MALLANNA ARREST: తీన్మార్‌ మల్లన్న అరెస్ట్ - telangana top news

తీన్మార్ మల్లన్నను చిలకలగూడ పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్ట్​ చేశారు. డబ్బుల కోసం బెదిరిస్తున్నారని తీన్మార్ మల్లన్నపై కేసు నమోదైంది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు... తీన్మార్ మల్లన్నను అరెస్ట్​ చేశారు.

chilakaluguda-police-arrested-teenmar-mallanna
తీన్మార్‌ మల్లన్నను అరెస్టు చేసిన చిలకలగూడ పోలీసులు

By

Published : Aug 28, 2021, 7:11 AM IST

Updated : Aug 28, 2021, 9:32 AM IST

చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నను చిలకలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. తనను డబ్బులు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారని మారుతీ జ్యోతిష్యాలయం వ్యవస్థాపకులు లక్ష్మీకాంత శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన బాధితులని కొందరిని ఫోన్​లో మాట్లాడిస్తూ యూట్యూబ్ ఛానెల్​లో లైవ్ టెలికాస్ట్ ఇచ్చారని... తప్పుడు వార్తలు ప్రచారం చేయకుండా ఉండాలంటే 30 లక్షలు ఇవ్వాలని తనని మల్లన్న బెదిరించారని లక్ష్మీకాంత శర్మ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు మల్లన్నను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అనంతరం తీన్మార్‌ మల్లన్నను అరెస్టు చేశారు.

కార్యాలయంలో తనిఖీలు..

ఇటీవలే తీన్మార్ మల్లన్న కార్యాలయంలో సైబర్ క్రైమ్ పోలీసుల తనిఖీలు నిర్వహించారు. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలోని కార్యాలయంలో సోదాలు చేసిన పోలీసులు హార్డ్ డిస్క్, పెన్‌డ్రైవ్, ఇతర కంప్యూటర్ పరికరాలు స్వాధీనం చేసుుకున్నారు. తీన్మార్‌ మల్లన్న వద్ద పనిచేసి మానేసిన ఓ యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టారు. తీన్మార్‌ మల్లన్నతో పాటు అతని సోదరుడు పలువురి వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్నట్లు యువతి ఆరోపణలు చేసింది. వ్యక్తిగత సమాచారంతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నట్లు సదరు యువతి ఫిర్యాదు చేసింది. వరి సమాచారం, ఎందుకు సేకరించారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే మల్లన్నకు నోటీసులు ఇచ్చేందుకే వచ్చామని పోలీసులు వెల్లడించారు.

ఇదీ చూడండి:CM KCR: 'నా చివరి రక్తపుబొట్టు దాకా శ్రమిస్తా'

Last Updated : Aug 28, 2021, 9:32 AM IST

ABOUT THE AUTHOR

...view details