Chemical exported illegally to Pakistan: భారత్ నుంచి పాకిస్థాన్‌కు అక్రమంగా రసాయనాల ఎగుమతి చేస్తున్న దందా గుట్టురట్టయింది. మెడికల్ మాఫియాకు బెంగళూరు జోన్ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు చెక్‌పెట్టారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారంలోని లూసెంట్ డ్రగ్ పరిశ్రమలో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు తనిఖీలు చేశారు. ట్రమడోల్ అనే రసాయనాన్ని భారీ ఎత్తున పాకిస్థాన్‌కు అక్రమంగా ఎగుమతి చేసినట్లు అధికారులు గుర్తించారు.
పాకిస్థాన్‌కు అక్రమంగా రసాయనాల ఎగుమతి.. ఆ పరిశ్రమలో కీలక ఉద్యోగులు అరెస్ట్
Chemical exported illegally to Pakistan: భారత్ నుంచి పాకిస్థాన్‌కు అక్రమంగా రసాయనాలు ఎగుమతి చేస్తున్న మెడికల్ మాఫియాను బెంగళూరు జోన్ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు బట్టబయలు చేశారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారంలోని లూసెంట్ డ్రగ్ పరిశ్రమలో తనిఖీలు చేపట్టిన అధికారులు.. ట్రమడోలు అనే రసాయనాన్ని భారీ ఎత్తున పాకిస్థాన్‌కు అక్రమంగా ఎగుమతి చేసినట్లు అధికారులు గుర్తించారు. పరిశ్రమ ఎండీ సహా కీలక ఉద్యోగులను అరెస్టు చేశారు.
ఈ పరిశ్రమకు కేవలం డెన్మార్క్, జర్మనీ, మలేసియా దేశాలకు ఎగుమతి చేసేందుకు మాత్రమే అనుమతి ఉంది. కానీ 2021 సంవత్సరంలో పాకిస్థాన్‌కు 25,000 కిలోల ట్రమడోలు ఎగుమతి చేసినట్లు అధికారులు గుర్తించారు. తనిఖీల్లో ఆధారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లూసెంట్ పరిశ్రమ ఎండీ, అసోసియేట్ వైస్‌ప్రెసిడెంట్ సహా మరో ముగ్గురు కీలక ఉద్యోగులను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు.
ఇదీ చదవండి:CM KCR in TRSLP Meeting: ''కశ్మీర్ ఫైల్స్'ను వదిలిపెట్టి.. ప్రజాసమస్యలపై దృష్టి పెట్టాలి'