తెలంగాణ

telangana

ETV Bharat / crime

'సోలార్ గోల్డ్ కోట్‌' యాప్‌తో గోల్‌మాల్‌ - solar gold coat application in playstore

solar gold coat app fraud : ఒకవంతు పెట్టుబడిగా పెడితే... రెండింతల డబ్బు.. ఖాతాలో వేస్తామని నమ్మించారు. కొంతమంది ఖాతాల్లో డబ్బులు వేసి నమ్మించారు. సభ్యుల్ని చేర్పిస్తే కమీషన్ చెల్లిస్తామనడంతో ఎంతోమందిని చేర్పించారు. కొందరు వేలల్లో, లక్షల్లో ఒకేసారి డబ్బులు చెల్లించారు. అంతే.. ఇన్నేళ్లు లావాదేవీల్ని నడిపిన యాప్..... ఒక్కసారిగా మాయమైంది. వాట్సాప్ గ్రూపు పనిచేయకుండా పోయింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 'సోలార్ గోల్డ్ కోట్' పేరిట జరిగిన ఆన్‌లైన్‌ మోసంతో జనం లబోదిబోమంటున్నారు.

solar gold coat app fraud
solar gold coat app fraud

By

Published : May 27, 2022, 12:44 PM IST

'సోలార్ గోల్డ్ కోట్‌' యాప్‌తో గోల్‌మాల్‌

solar gold coat app fraud : 'సోలార్ గోల్డ్ కోట్' యాప్‌ పేరుతో జనానికి కుచ్చుటోపీ పెట్టారు. పెట్టుబడులు పెడితే రెట్టింపు ఆదాయం వస్తుందటూ వాట్సాప్‌ల్లో ప్రచారం చేశారు. 400 పెట్టుబడి పెడితే... ఆ మెత్తాన్ని రోజుకూ 14 రూపాయల చొప్పున 45 రోజుల్లో తిరిగి చెల్లిస్తామన్నారు. అలా వెయ్యి, 3వేలు, 13వేలు, 35వేలు, 75వేలు, లక్ష చెల్లిస్తే గరిష్ఠంగా... ఆర్నెళ్లలో 8లక్షల52వేల వరకూ చెల్లిస్తామని నమ్మబలికారు. రుజువుగా అప్పటి వరకు ఆదాయాన్ని పొందినవాళ్లను వాట్సాప్ గ్రూపుల్లో చేర్చారు.

solar gold coat app cheating : సంప్రదింపులన్నీ వాట్సాప్ వేదికగా సాగితే.. లావాదేవీలన్నీ యాప్ ద్వారా జరిగాయి. పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య క్రమంగా పెరిగిపోగా.... నాలుగైదు రోజుల కిందట యాప్ మాయమైంది. వాట్సాప్ గ్రూపుల్లో సభ్యులు కనిపించకుండా పోయారు. డబ్బులు రావడం ఆగిపోయింది. మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటున్నారు.

"సోలార్ గోల్డ్ కోట్ యాప్‌లో ఇన్వెస్ట్ చేస్తే రోజు రూ.1500 నుంచి రూ.4000 వరకు వస్తుందని చెప్పారు. అందుకే మేం అందులో పైసలు పెట్టాం. నేను రూ.35000 వేస్తే.. నాకు రూ.8 లక్షలు వస్తుందని చెప్పారు. కానీ నాకు రూ.4000 మాత్రమే వచ్చింది. తర్వాత కాల్ చేస్తే ఎవరూ స్పందించలేదు. మెసేజ్‌లకు రెస్పాండ్‌ కాలేదు. ప్లే స్టోర్‌లో యాపే మాయమైపోయింది." -- బాధితులు

పెట్టుబడి పెట్టి ఆదాయం పొందడం కాకుండా సభ్యులను చేర్చితే కమీషనిస్తామని అధిక సంఖ్యలో చేర్పించారు. కొందరు అత్యాశకు పోయి ఒకేసారి లక్ష వరకు పెట్టుబడి పెట్టారు. ఉమ్మడి పాలమూరు జిల్లానే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా యాప్ బాధితులు ఉంటారని అంచనా. రూ.10 కోట్లకుపైగా యాప్ నిర్వాహకులు దగా చేసినట్లు తెలుస్తోంది.

గతంలోనూ నారాయణపేట జిల్లాలో క్రిప్టో కరెన్సీ, బిట్‌కాయిన్‌ గొలుసుకట్టు వ్యాపారంతో వంచించారు. గద్వాల జిల్లాలోనూ వాట్సప్ గ్రూపుల్లో ఆన్‌లైన్ లావాదేవీలతో జనాన్ని బోల్తా కొట్టించారు. మోసం చేసిందెవరో తేల్చుకోలేక బాధితులు దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం ప్రకటనలను నమ్మొద్దని వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు.

"ఇన్వెస్ట్ చేసిన మొదట్లో లింక్ ఓపెన్ అవుతుంది. మెల్లిగా పెట్టుబడి పెరగడం గమనిస్తారు. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టగానే లింక్ క్లోజ్ చేస్తారు. వాట్సాప్ గ్రూపుల నుంచి మాయమవుతారు. అసలు ప్లే స్టోర్‌లో యాపే ఉండదు. ఫోన్‌లో ఉన్న యాప్ పనిచేయదు. మొదట నలుగురైదురికి డబ్బులు ఇస్తారు. ఇక పెద్ద మొత్తంలో డబ్బు రాగానే గాయబ్ అవుతున్నారు." -- బాధితులు

ABOUT THE AUTHOR

...view details