మేడ్చల్ జిల్లా కుషాయిగూడ గాంధీ నగర్లో సూసైడ్ చేసుకున్న యువతి కేసును కుషాయిగూడ పోలీసులు ఛేదించారు. ఏప్రిల్ నెలలో సలోని అనే యువతి తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. గడ్డం కార్తిక్ అనే యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
కుషాయిగూడ సూసైడ్ కేసును ఛేదించిన పోలీసులు - తెలంగాణ వార్తలు
కుషాయిగూడ గాంధీ నగర్లో సూసైడ్ చేసుకున్న యువతి కేసును పోలీసులు ఛేదించారు. గడ్డం కార్తిక్ అనే యువకుడు పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేయడం వల్ల మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు తెలిపారు.
love cheating case, young woman died case, kushayiguda
'గడ్డం కార్తిక్ సలోనిని ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అతడు మరో యువతిని ప్రేమిస్తున్నాడని తెలుసుకున్న సలోని.. కార్తిక్ను నిలదీసింది. ఆ యువతినే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో సలోని మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడింది' అని పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: సైబర్ నయా మోసం: "హలో.. మేము హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నాం.."