Bitcoin Cheating: బిట్‌కాయిన్లు.. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే మూడు నెలల్లో రూ.లక్షకు తొమ్మిది లక్షలిస్తామంటూ సైబర్ నేరగాళ్లు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. టెలిగ్రామ్ మెసెంజర్, ట్విటర్‌లో ప్రచారం చేస్తూ యూట్యూబ్ లింకులు పంపుతూ క్రిప్టో కరెన్సీలో మదుపు చేయిస్తున్నారు. రూ.లక్షలు నగదు బదిలీ చేశాక ఫోన్లు స్విచ్ఛాఫ్ చేస్తున్నారు. కొద్దినెలలుగా దిల్లీ, ముంబయి, కోల్‌కతాల నుంచి మోసాలకు పాల్పడుతున్న కేటుగాళ్లు తాజాగా గుజరాత్‌లోనూ మోసాలకు తెరతీశారు. మెహసనా పట్టణంలో నివాసముంటున్న హితేశ్‌పటేల్, గోర్ధాన్‌బాయ్, మంగళ్‌దాస్ పటేల్‌లు స్వీక్స్ వాలెట్స్ పేరుతో రూ.కోట్లు కొల్లగొట్టారు.
బాధితుడి ఫిర్యాదుతో...
ఓ బాధితుడి ఫిర్యాదుతో సైబర్‌క్రైం పోలీసులు 71 సంవత్సరాల మంగళ్‌దాస్ పటేల్‌ను గుజరాత్‌లో అరెస్ట్ చేయగా.. హితేశ్ పటేల్ తప్పించుకున్నాడు. మంగళ్‌దాస్‌ను పోలీసులు విచారించగా... సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్లతో పాటు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోనూ వీరిద్దరిపై కేసులున్నాయి. ఇంతేకాదు మంగళ్‌దాస్ కొద్దిరోజుల క్రితం పట్టుబడ్డాడన్న సమాచారంతో రాజస్థాన్ పోలీసులు సైబర్‌క్రైం పోలీసులకు ఫోన్ చేశారు. తమకు అప్పగించాలంటూ అభ్యర్థించారు.
కొడుకు మోసాలు.. తండ్రి బుకాయింపు..
గుజరాత్‌లోని మెహసనా పట్టణంలో ఉంటున్న హితేశ్ పటేల్ కొద్దినెలల నుంచి క్రిప్టో కరెన్సీలో మదుపు చేయండి అంటూ సామాజిక మాధ్యమాలు, టెలిగ్రామ్ ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నాడు. ఇతడి మాటలు నమ్మిన బాధితులు రూ.లక్షల్లో అతడికి నగదు బదిలీ చేశారు. మోసపోయిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తారన్న ముందస్తు అంచనాతోనే హితేశ్ పటేల్ తాను నిర్వహిస్తున్న స్వీక్స్ వాలెట్స్, నరాద్‌పే, బుల్‌రన్ వంటి మొబైల్ యాప్‌ల చిరునామా, నగదు జమచేయాల్సిన ఖాతాలను తన తండ్రి గోర్ధాన్‌బాయ్ పటేల్ పేరుతోనే వ్యవహరించాడు.
నాటకం...