తెలంగాణ

telangana

ETV Bharat / crime

ATM card theft: సాయం చేయమంటే మాయం చేశాడు - వృద్ధాశ్రమంలో చోరీ

ఆశ్రమంలో వృద్ధుడికి పర్యవేక్షకుడిగా ఉంటూ.. అతని వద్ద నుంచి రూ. లక్షలు కాజేశాడో యువకుడు. ఏటీఎం నుంచి కొనుగోళ్లు చేసి ఇవ్వమని సాయమడిగితే.. ముసలోడే కదా అని మోసం చేశాడు. అనుమానం వచ్చిన బాధితుడు.. పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది. హైదరాబాద్​లోని నాగోల్​లో ఇది జరిగింది.

cheater arrest
cheater arrest

By

Published : Jun 11, 2021, 9:16 PM IST

వృద్ధాశ్రమంలో పర్యవేక్షకుడిగా ఉన్న ఓ యువకుడు.. ఓ వృద్ధుడి ఏటీఎం కార్డును దుర్వినియోగం చేసి రూ. 1. 57 లక్షలను కొల్లగొట్టాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్​లోని నాగోల్​లో ఇది జరిగింది.

ఉప్పుగూడకు చెందిన నిందితుడు రామకృష్ణ.. నాగోల్‌లోని ఓ వృద్ధాశ్రమంలో పర్యవేక్షకుడిగా పని చేసేవాడు. ఆశ్రమానికి చెందిన ఓ వృద్ధుడు.. ఏటీఎం ద్వారా ఆన్​లైన్​లో తనకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేయడానికి రామకృష్ణను సాయమడిగేవాడు. ఈ క్రమంలో.. రామకృష్ట ఆ ఏటీఎం కార్డుతో తరచూ అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, జొమాటో వంటి సైట్లలో కొనుగోళ్లు చేసి రూ. లక్షలు దుర్వినియోగం చేశాడు. బాధితుడితో ఫిర్యాదుతో.. అసలు విషయం బయటపడింది.

ఇదీ చదవండి:KTR responds: చిన్నారులకు కేటీఆర్ ఆపన్నహస్తం

ABOUT THE AUTHOR

...view details