తెలంగాణ

telangana

Chandrababu: 'ఫ్యాక్షనిజం పోకడలతో ఏం సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారు?'

By

Published : Jun 17, 2021, 1:00 PM IST

ఏపీలోని కర్నూలు (kurnool) జిల్లా పాణ్యం నియోజకవర్గం పెరసవాయిలో తెదేపా (TDP) నేతలు వడ్డి నాగేశ్వర రెడ్డి, వడ్డి ప్రతాప్ రెడ్డి హత్యలపై తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu), ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్(Lokesh)మండిపడ్డారు. వైకాపా బాధిత కుటుంబాలకు తెదేపా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

chandrababu-and-lokesh-about-tdp-leaders-murder-in-kurnool
Chandrababu: 'ఫ్యాక్షనిజం పోకడలతో ఏం సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారు?'

ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా పెసరవాయిలో తెదేపా నాయకుల హత్యను పార్టీ అధినేత చంద్రబాబు(Chandrababu), పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్(Lokesh) ఖండించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని చంద్రబాబు ఆరోపించారు. విచక్షణతో తెదేపా కార్యకర్తలను హతమారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా లేదా అన్న అనుమానం కలుగుతోందన్న తెదేపా అధినేత.. కర్నూలు జిల్లా పెసరవాయిలో తెదేపా నాయకులను కారుతో ఢీకొట్టి చంపడం దారుణమని మండిపడ్డారు.

'హత్యల వెనక ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి హస్తం ఉంది. ఫ్యాక్షనిజం పోకడలతో ఏం సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారు? వైకాపా అధికారంలోకి వచ్చాక 30 మంది తెదేపా కార్యకర్తలు హత్యకు గురయ్యారు. హత్యాకాండకు వైకాపా ప్రభుత్వం, పోలీసులదే బాధ్యత. రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకోకతప్పదు. మృతుల కుటుంబాలకు తెదేపా అండగా నిలుస్తుంది'

-తెదేపా అధినేత చంద్రబాబు

'తెదేపా శ్రేణులే లక్ష్యంగా దాడులు'

'దాడిలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. మృతుల కుటుంబాలకు తెదేపా అండగా ఉంటుంది. రాష్ట్రంలో జ‌గ‌న్‌ రెడ్డి (cm jagan), వైకాపా నేత‌ల‌ నెత్తుటి దాహానికి.. ఈ దారుణ‌ మ‌ర‌ణాలే సాక్ష్యం. సీఎం ముసుగు తీసేసి ఫ్యాక్షనిస్టు రూపాన్ని జగన్ బయటపెడుతున్నారు. వేటకొడవళ్లు, కత్తులు, గొడ్డళ్లకు పదునుపెట్టి పల్లెల్లో తెదేపా శ్రేణులే లక్ష్యంగా జగన్ రెడ్డి గ్యాంగ్​లు ప్రతీకారాలకు దిగుతున్నాయి. ఫ్యాక్షన్ ముఠాలు ఆ ఫ్యాక్షన్‌కే పోతాయి. గ్రామాల్లో శాంతి నెలకొల్పి స్నేహపూర్వక వాతావరణం కల్పించేందుకు తెదేపా ఎప్పుడూ సిద్ధమే' అని లోకేశ్ ట్వీట్(tweet) చేశారు.

ఇదీ చదవండి:Murder : కర్నూలు జిల్లాలో ఇద్దరు తెదేపా నాయకుల దారుణ హత్య

ABOUT THE AUTHOR

...view details