ChamalaValasa Tractor Accident : ఏపీ విజయనగరం జిల్లా బొండపల్లి మండలం చామలవలస వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ట్రాక్టర్‌లో 35 మంది ప్రయాణిస్తున్నారు. ప్రమాదంలో 22 మందికి గాయాలు కాగా.. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ChamalaValasa Tractor Accident : ట్రాక్టర్ బోల్తా.. 22 మందికి గాయాలు.. ఆరుగురి పరిస్థితి విషమం - ChamalaValasa Accident News
ChamalaValasa Tractor Accident : ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా బొండపల్లి మండలం చామలవలస వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో 22 మంది గాయపడ్డారు. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు.
ChamalaValasa Accident News : కిండాం అగ్రహారంలో వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులు మెంటాడ మండలంలోని చింతాడవలస వాసులుగా గుర్తించారు. ప్రమాద సమాచారం అందుకున్న 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను గజపతినగరం, విజయనగరం ఆస్పత్రులకు తరలించారు. వీరందరినీ మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. క్షతగాత్రులల్లో చందక లక్ష్మి, చందక వరలక్ష్మి, సిరపురపు సత్యం, బొగుల సూర్యనారాయణ, చందక కన్నయ్య లతో పాటు మరొకరు ఉన్నారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.