మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలోని శ్రీనివాస్ నగర్‌లో దొంగలు రెచ్చిపోయారు. కవిత అనే మహిళ దుకాణానికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఓ వ్యక్తి వెనుక నుంచి ఆమెను వెంబడించి... మెడలోని 3.2 తులాల బంగారు గొలుసును లాక్కొని వెళ్లిపోయారు.
రెచ్చిపోయిన దొంగలు.. 3.2 తులాల బంగారం అపహరణ - తెలంగాణ వార్తలు
పట్ట పగలే మహిళ మెడలో బంగారు గొలుసు తెంపుకొని వెళ్లిన ఘటన మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. చోరీ చేసిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి.
చైన్ స్నాచింగ్ దొంగలు
బాధిత మహిళ అతడిని వెంబడించగా రోడ్డుపై మరో వ్యక్తి ద్విచక్రవాహనంపై సిద్ధంగా ఉండడంతో దానిపై పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని... కేసు నమోదు చేసి సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:ప్రేమలేనిదే జీవించలేమని.. ప్రేమికుల ఆత్మహత్య