Chain Snatching In Miyapur: హైదరాబాద్ నగరంలో గొలుసు దొంగలు రెచ్చిపోతున్నారు. ఈ మాట ఇప్పుడు కాదు ఎన్నో రోజుల నుంచి భాగ్యనగరంలో వినిపిస్తూనే ఉంది. జల్సాలకు అలవాటు పడిన కొందరు యువత.. ఈజీ మనీ కోసం ఇటువంటి దారులను ఎంచుకుంటున్నారు. దొరికితే దొంగ.. దొరక్కపోతే దొర అన్నట్లు సాగుతుంది వీరి వ్యవహారం. ఆ క్షణానికి చేతిలో డబ్బులు లేకపోతే.. ఇటువంటి మార్గాలను ఎంచుకుని ఎదుటివారి ప్రాణాలను సైతం లెక్కచేయడం లేదు.
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారే కాకుండా నగరంలో నివాసం ఉండే కొంత మంది యువత సైతం ఇటువంటి గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఒంటరి మహిళలు, వృద్ధులే లక్ష్యంగా చేసుకుంటూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. పోలీసులు ఎంత నిఘా పెట్టినా వీరి ఆగడాలు మాత్రం తగ్గడం లేదు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఉంటున్నాయి అన్న భయంలేకుండా వారు.. ఎంతో చాకచక్యంగా ఇటువంటి పనులు కానిస్తున్నారు.
తాజాగా హైదరాబాద్ నగరంలోని మియాపూర్‌లో ఓ మహిళ మెడల్లోంచి బంగారు గొలుసును దుండగులు బైక్పై నుంచి వచ్చి తెంచుకుని పారిపోయారు. ఈ దృశ్యాలు మొత్తం సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. వివరాల్లోకి వెళితే.. మియాపూర్ ప్రశాంత్ నగర్లోని కృషినగర్లో ఓ ప్రైవేటు స్కూల్లో రెండవ తరగతి చదువుతున్న తన కుమారుడిని ఇంటికి తీసుకొని వెళ్లడానికి ఓ మహిళ వచ్చింది. తన పిల్లాడిని ఇంటికి తీసుకొని వెళుతుండగా.. ఆ ప్రాంతం నిర్మానుశ్యంగా ఉండడంతో ఆమె ఎదురుగా బైక్పై ముందుగా కాపుకాచుకొని దుండగులు ఎదురు చూశారు.